Hyderabad Rape Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. వీడియోలు షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

Hyderabad Rape Case: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వరుసగా బయటికి వస్తున్న వీడియోలు పోలీసులను పరేషాన్ చేస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Jun 6, 2022, 02:30 PM IST
  • మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్
  • వీడియోలు షేర్ చేసిన వ్యక్తికి నోటీస్
  • కేసులో కీలకంగా బెంజ్, ఇన్నోవా కార్లు
Hyderabad Rape Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్.. వీడియోలు షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

Hyderabad Rape Case: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వరుసగా బయటికి వస్తున్న వీడియోలు పోలీసులను పరేషాన్ చేస్తున్నాయి. అసలు ఈ వీడియోలు ఎవరు లీక్ చేస్తున్నారన్నది మిస్టరీగా మారింది. అయితే ఈ విషయంలో కీలక పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరొకరికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.

కారులో ప్రయాణిస్తున్న నిందితుల వీడియోలను సర్క్యులేట్ చేసిన పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభాన్ ను అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ మీడియా పేరుతో సుభాన్.. గ్యాంగ్ రేప్ బాధితురాలు నిందితులతో కలిసి కారులో ఉన్న వీడియోలను లీక్ చేయడంతో పాటు వైరల్  చేశారని పోలీసులు గుర్తించారు. సుభాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనికి వీడియోలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. మైనర్ బాలిక వీడియోలు బయటికి రావడం వెనుక ఎవరున్నారు.. ఎందుకు వైరల్ చేశారు.. కావాలనే చేశారా లేక తమ మీడియా ప్రమోషన్ కోసం ఇలా చేశారా అన్న కోణంలో సుభాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ పబ్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లిన నిందితులు..  ఇన్నోవా కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆ కారులోనే  మొయినాబాద్ వెళ్లారని పోలీసులు గుర్తించారు. అక్కడే ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ లో ఉన్న  ఓ రాజకీయ నేత ఫాంహౌస్ లో ఆ రాత్రి నిందితులు మందు పార్టీ చేసుకున్నారు. తర్వాత ఫుల్ల్ గా ఎంజాయ్ చేశారు. ఫాంహౌస్ లో  ఎంజాయ్ చేసిన వీడియోలను నిందితులు తన స్నేహితులతో పాటు వాట్సాప్ గ్రూపులలో సెండ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు నిందితులు ఆ వీడియోలను తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. దీంతో స్టేటస్ పెట్టుకున్న వీడియోలను డౌన్ లోడ్ చేసి వైరల్ చేశారా లేక నిందితుల నుంచి వాళ్లకు వచ్చిందా అన్న కోణంలోనూ  పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు వాడిన బెంజ్‌, ఇన్నోవా కార్లు కీలకంగా మారాయి. ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న బెంజ్, ఇన్నోవా కార్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. బెంజ్‌ కారులో బాధితురాలి చెప్పు, తల వెంట్రుకలు, చెవి రింగ్ దొరికాయని తెలుస్తోంది. అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఫింగర్ ప్రింట్స్ ను సేకరించారు. ఇక గ్యాంగ్ రేప్ ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బయటపెట్టిన వీడియోను పోలీసులు పరిశీలించారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తర్వాత ఎమ్మెల్యే కొడుకును కేసులో ఆరవ నిందితుడిగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొడుకు ఇప్పటికే దుబాయ్ వెళ్లిపోయారనే వార్తలు వస్తున్నాయి. నాలుగు రోజులుగా గాలిస్తున్నా పోలీసులకు దొరక్కపోవడంతో అతను దుబాయ్ వెళ్లి ఉంటారనే వాదన బలపడుతోంది.

Read also: Hyderabad gang rape case: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణ..దుబాయిలో కీలక నిందితుడు..!

Read also: Mla Raja Singh Comments: గ్యాంగ్‌ రేప్‌ కేసులో సీఎంవో నుంచే తప్పించే కుట్రలు..రాజాసింగ్ హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News