Almora Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిపోయిన బస్సు.. షాకింగ్ వీడియో వైరల్..

Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Uttarakhand bus accident in almora: ఉత్తర ఖండ్ లో సోమవారం ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బస్సు ప్రమాదం.. అల్మోరా జిల్లాలోని సాల్ట్‌లోని కుపి గ్రామ సమీపంలో ఈ ఘోం జరిగినట్లు తెలుస్తొంది. గర్వాల్ మోటార్ ఓనర్స్ యూనియన్ లిమిటెడ్‌కి చెందిన బస్సు ఓవర్ లోడ్ కారణంగా లోయలో పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో.. 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ ప్రమాదం జరగ్గానే ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో అరుపులు, కేకలు పెట్టినట్లు తెలుస్తొంది.
వెంటనే సమీపంలో ఉన్న ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. అయితే.. గాయపడిన వారిని స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది సహాకారంతో.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించి సేవలు అందిస్తున్నారు.
మరోవైపు.. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుతెలుస్తొంది. అక్కడ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని, సహాయక చర్యలువేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను హెలికాప్టర్ లలో ఎయిర్‌లిఫ్ట్ చేయాలని సూచించారు.
సంఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ప్రమాద సమయంలో బస్సుల్లో పరిమితికి మించి ఉన్నట్లు తెలుస్తొంది. అక్కడ చాలా మంది శరీర భాగాలు కూడా ఛిద్రమై పోయినట్లు తెలుస్తొంది. దీంతో తమ వారి కోసం బాధితులు అక్కడికి చేరుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.