Uttarakhand Election Result 2022 : ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Uttarakhand Election 2022) భాజపా దూసుకుపోతుంది. 70 స్థానాల్లో కాషాయం పార్టీ (BJP) ఇప్పటికే 40 స్థానాలకుపైగా గెలుచుకుంది. 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌రావత్ (Former CM Harish Rawat) ఓటమి పాలయ్యారు. లాల్‌కాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన ఆయన పరాజయం పాలయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 14న ఒకే దశలో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ (congress) తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. భాజపా ఆధిక్యం సాధించిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి, ఉత్తరాఖండ్‌ భాజపా వ్యవహారాల బాధ్యుడు ప్రహ్లాద్‌ జోషి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి పాలనలో రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పథకాలు అందించామని...అందుకే అనుకున్న ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. 


Also Read: Pujab Election Result 2022: పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ఓటమి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook