కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు, పుణ్యక్షేత్రాలు మూసివేసి భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం గంగోత్రి ఆలయాన్ని (Gangotri Temple) కొన్ని రోజులు మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు (Gangotri Temple Closed) గంగోత్రి ఆలయ సమితి అధ్యక్షుడు సురేష్ సెంవాల్ తెలిపారు. Aishwarya Rai: మీ అందరికీ థ్యాంక్స్: నటి ఐశ్వర్యరాయ్

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంగోత్రి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఆలయానికి అన్నివైపులా దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో భక్తులు, ఇతరత్రా ప్రజలను నిలిపివేయనున్నట్లు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో భాగంగా గంగోత్రి ధామ్‌ను కొన్ని రోజులు మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సురేష్ సెంవాల్ చెప్పారు.  Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 


ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్, కేధార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను కలిపి చార్‌ధామ్, చార్‌ధామ్ యాత్ర అని పిలుస్తారని తెలిసిందే. అన్ని రంగాలతో పాటు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై కోవిడ్19 ప్రభావం పడింది.  India: 15 లక్షలు దాటిన కరోనా కేసులు