Covid19 vaccine: అగ్రరాజ్యాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోంది. మరి ఇండియాలో ఎప్పుడనేదే ప్రశ్నగా ఉంది. అనుమతి లభిస్తే మాత్రం..జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) కోసం ఎదురుచూపులు ఆగిపోయాయి. ఇక వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రారంభం కావడమే మిగిలింది. అమెరికా, యూకేల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ఇండియాలో ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) అధినేత అదార్ పూణావాలా ( Adar poonawalla ) చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. అనుమతి లభిస్తే..జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని ప్రకటించి ఆశలు రేపారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca vaccine ) ‌ను ఇండియాలో కోవిషీల్డ్ ( Covishield )పేరుతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా..ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ అనుమతి డిసెంబర్ నాటికి వస్తే..జనవరి నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుందని స్పష్టం చేశారు. Also read: Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి


ఒక గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జనాభాలో 20-30 శాతం మందికి వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోందన్నారు. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే..అందరికీ ఒక రకమైన విశ్వాసం ఏర్పడుతుందన్నారు. జూలై నాటికి 3 వందల నుంచి 4 వందల మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అవసరమౌతాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి కావల్సిన వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందన్నారు. 


ఇప్పటికే సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను 250 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ ధరకే సరఫరా చేయనుంది. మరోవైపు అమెరికా కంపెనీ ఫైజర్ సైతం ఇండియాలో అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DGCI )కు దరఖాస్తు చేసుకుంది. Also read: CBI Gold Case: 103 కిలోల బంగారం ఏమైంది..సీబీఐపై పోలీసుల విచారణ