న్యూఢిల్లీ: బాల్యంనుంచే విలువలతో కూడిన విద్యను అందించాలని, అప్పుడే కాకతీయుల పాలనలాంటి సమసమాజ స్థాపన సాధ్యమని,  పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్.. పోలీసు వ్యవస్థ సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత యువత ముందు విస్తృతమైన అవకాశాలు కనబడుతున్నాయని వీటిని అందిపుచ్చుకునేందుకు నైపుణ్యతతోపాటు నైతికతతో కూడిన విద్యావిధానం అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా విద్యార్థులను తయారుచేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు విద్యాసంస్థలు, విద్యావేత్తలదని ఆయన పేర్కొన్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆదివారం వరంగల్ లోని ఆంధ్ర విద్యాభివర్ధిని విద్యాలయం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత్ కు పెద్ద బలమని,  రానున్న 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయని అన్నారు. అయితే దీనికి కావాల్సిందల్లా అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమేనన్నారు. ఇది ప్రభుత్వాలతోపాటు కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల బాధ్యత’ అని అన్నారు. 



విద్యాలయాల్లో పాఠ్యాంశాలు, నైపుణ్యతతోపాటుగా.. నైతికతను, జాతీయతా భావాన్ని, వాస్తవమైన భారత చరిత్రను అందించడాన్ని తప్పనిసరి చేయాలని.. అప్పుడే విద్యార్థి తన జీవితంలో వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజ శ్రేయస్సుకు పాటుపడేందుకు సిద్ధపడతాడన్నారు. 


సమాజంలో పెచ్చుమీరుతున్న కుల, మత, లింగ వివక్షకు అడ్డుకట్ట వేయడంతోపాటు అవినీతిని పారద్రోలే  బాధ్యతను యువత తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. అనాదిగా.. భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వమానవ సౌభ్రాతత్వాన్ని, సర్వధర్మ సమభావనను పాటిస్తూ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న మనదేశంలోనే అక్కడక్కడ వివక్షతలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య భారతంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. అయితే అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి తప్ప.. విధ్వంసపూరితంగా ఉండకూడదన్నారు. కొంతకాలంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని అలాంటి వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 


ప్రాంతాలు, భాషలు వేరైనా భారతీయులంతా ఒక్కటే అనే జాతీయతాభావనను సతతం మదిలో నింపుకుని ముందుకెళ్లాలని అన్నారు.  ప్రజాస్వామ్య భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన సర్వధర్మ సమభావన దెబ్బతీసేలా కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని,  దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు అంశాలపై జరుగుతున్న అల్లర్లు చూస్తుంటే.. ఈ విషయం సుస్పష్టమవుతోందని అన్నారు. విచ్ఛిన్నకర శక్తులు అదునుచూసి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా విషం చిమ్ముతున్నాయని, ఈ పరిస్థితుల్లోనే మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి దుష్టశక్తులకు దూరంగా ఉంటూ వాస్తవాలను అవగతం చేసుకునేందుకు ప్రయత్నించాలి’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..