Venkaiah Naidu batukamma festival wishes: న్యూఢిల్లీ: ఓ వైపు పూల‌ పండుగ బతుకమ్మ (Bathukamma).. మరోవైపు దేవీ శరన్నవరాత్రుల పూజలతో తెలంగాణ అంతటా సందడి నెలకొంది. అయితే ప్రకృతి పండుగ ( bathukamma festival ) ను పురస్కరించుకుని తెలంగాణ‌ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) శుభాకాంక్షలు తెలిపారు. న‌వ‌రాత్రుల్లో అమ్మ‌వారిని ప్ర‌కృతి శ‌క్తిగా ఆరాధించే సంప్ర‌దాయం నుంచి బ‌తుక‌మ్మ పండుగ‌ పుట్టిందని.. ఆ ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమంటూ వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఈ విధంగా ట్విట్ చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతితో మమేకమై జరుపుకునే ‘బతుకమ్మ’ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు. మన జీవసృష్టికి ప్రకృతే మూలం. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమని నేను బలంగా విశ్వసిస్తానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నవరాత్రుల్లో.. అమ్మవారిని ప్రకృతిశక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ బతుకమ్మ పండుగలో కులాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఓ చక్కటి సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ బతుకమ్మను జరుపుకోవాలని సూచిస్తున్నానంటూ ఆయన ట్విట్ చేశారు. Also read: Navratri Day 1: స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం


ఇదిలాఉంటే.. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) కూడా రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. Also read: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe