బాహుబలిగా శివరాజ్ సింగ్ చౌహాన్.. వీడియో వైరల్
మధ్య ప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
మధ్య ప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొనింది. ఈ నేపథ్యంలో.. బీజేపీ పార్టీకి చెందిన ఓ అభిమాని రూపొందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాహుబలి సినిమా స్పూఫ్‌ను రూపొందించాడు ఆ అభిమాని. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో నరేంద్ర మోదీ నుండి సోనియా గాంధీ వరకు అందరూ ఉన్నారు.
ఈ వీడియోలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బాహుబలిగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను భళ్లాలదేవ్‌గా మార్ఫింగ్ చేసి చూపించాడు. ఇక శివలింగాన్ని ఎత్తే సీన్‌లో అయితే మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, రాహుల్ గాంధీ, బాహుబలిని పెంచిన తల్లి క్యారెక్టర్‌లో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని చూపించి ఆశ్చర్యపరిచాడు. కట్టప్పగా నరేంద్ర సింగ్ తోమర్‌ను మార్ఫింగ్ చేసి చూపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు..