బీహార్ లోని సుపౌల్ లో ఓ జంటకు ఘోర అవమానం జరిగింది. ఊరి గ్రామ పెద్దలు ఆ జంటను నడిరోడ్డుపై నిలబెట్టి  గుంజీళ్లు తీయించారు. మహిళ చేత నేల నాకించారు. అంతగా వారు చేసిన ఆ నేరమేమి అంటారా?  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. సుపాల్ లో ఓ జంట గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వారి పెళ్లిని అంగీకరించకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇది వారి చేసిన నేరం. ఇందుకు గానూ ఖాప్ పంచాయతీ వారిద్దరికీ శిక్ష విధించారు. గ్రామం నడిబొడ్డున వాళ్లని నిలబెట్టి గుంజీలు తీయించారు. నేల నాకించారు. గ్రామ పెద్దలు ఇలా ఓ జంటకు తీర్పు చెప్పి అవమానించారు.