Girl Goes School on One Leg: సంకల్పమే కారుచీకట్లను బద్దలు కొడుతుంది... పేదల జీవితాలకు చదువు మాత్రమే వెలుగుదారులు పరుస్తుంది... బీహార్‌కి చెందిన సీమ అనే 10 ఏళ్ల బాలికకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. బాగా చదువుకోవాలి.. పెద్దయ్యాక టీచర్ అవ్వాలి... తనలాంటి ఎంతోమంది పేదలకు చదువు చెప్పాలి... ఇలా కలలు కంటున్న సీమ జీవితాన్ని విధి రోడ్డు ప్రమాదం రూపంలో వెక్కిరించింది. అయినా ఆమె మొక్కవోని సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఫతేపూర్‌ సీమ స్వగ్రామం. ఆమె తండ్రి ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. తల్లి ఇటుకబట్టీల్లో దినసరి కూలీ. సీమకు చదువంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. పెద్దయ్యాక టీచర్ అవాలని... పేద పిల్లలకు చదువు చెప్పాలని కలలు కంటుండేది. కానీ రెండేళ్ల క్రితం ట్రాక్టర్ ఢీకొట్టడంతో రెండు కాళ్లలో ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సీమ కుంగిపోలేదు.


చదువుకోవాలనే ఆమె తపన ముందు వైకల్యం చిన్నబోయింది. ఒంటికాలితోనే నిత్యం 1 కి.మీ దూరం నడిచి స్కూల్‌కు వెళ్తోంది. అందరు చిన్నారుల్లా ఆమె నడవలేదు కాబట్టి... ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు వెళ్లి వస్తోంది. ఇటీవల సీమ స్కూల్‌కు వెళ్తున్న వీడియోను ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.


సీమ గురించి తెలిసి స్థానిక అధికారులు ఆమెకు మూడు చక్రాల సైకిల్ ఇచ్చారు. త్వరలోనే ఆమెకు కృత్రిమ కాలు కూడా పెట్టిస్తామని, పక్కా ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తన పరిస్థితిపై సీమ మాట్లాడుతూ.. మొదట్లో ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు వెళ్లడం చాలా కష్టంగా, నొప్పిగా ఉండేదని పేర్కొంది. కానీ రాను రాను అలవాటైపోయిందని చెప్పింది. తన తోటివారు స్కూల్‌కు వెళ్లడం చూసి... ఎలాగైనా తాను కూడా చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వికలాంగురాలు అయినప్పటికీ సీమలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని.. ఇతర పిల్లలకు ఆమె ఎందులోనూ తీసిపోదని శివ కుమార్ భగత్ అనే స్థానిక టీచర్ తెలిపారు. సీమ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సంకల్పానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.



Also Read: Beggar Buy Bike: భార్యకు ప్రేమతో.. 90 వేల బైక్‌ కొన్న బిచ్చగాడు! రోజువారీ సంపాదన తెలిస్తే షాకే 


Also Read: Hyderabad Honor Killings : హైదరాబాద్‌లో మరో పరువు హత్యకు విఫలయత్నం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి