Kangana Ranaut old Video viral: భారత సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ (Sushant Singh Rajput) అకాల మరణం నాటి నుంచి  ఇటు బాలీవుడ్‌లో.. అటు రాజకీయ పార్టీల్లో వైరం రాజుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ డెత్ కేసు విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టుచేసి విచారిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన కామెంట్లు మరింత వేడిని రాజేశాయి. 99శాతం బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకుంటారంటూ పేర్కొనడంతోపాటు.. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపైనే కంగనా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే కంగనా పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను కూడా డ్రగ్స్‌కు బానిసయ్యానంటూ ఈ ఏడాది మార్చిలో మనాలీలోని తన ఇంటి దగ్గరి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది నటి కంగనా. నటి కావాలనే ఉద్దేశ్యంతో ఇంటినుంచి పారిపోయి ముంబాయికి వచ్చాను.. కొన్ని సంవత్సరాల తర్వాత నటిగా ఎదగడంతోపాటు డ్రగ్స్‌కి బానిసయ్యాను.. ఆ తర్వాత చెడ్డవారి చేతుల్లో ఎన్నో కష్టాలను అనుభవించానంటూ వీడియోలో పేర్కొంది. అయితే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.  Also read: US Open 2020: ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్‌గా నవోమి ఒసాకా


 

 

 

 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



 

 

 

 

 

 

 

 

 

#KanganaRanaut talks about the time when she couldn’t close her eyes because tears won’t stop. 🙏🙏


A post shared by Kangana Ranaut (@kanganaranaut) on


ఇదిలాఉంటే.. ఈ వీడియో ఆధారంతోపాటు.. ఆమె మాజీ ప్రియుడు నటుడు అధ్యాయన్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో కంగనాకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలున్నాయని తెలిపిన వీడియో వైరల్ కావడంతో దర్యాప్తునకు ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కూడా స్పష్టంచేశారు.  Also read: Amit Shah: మళ్లీ ఆసుపత్రిలో చేరిన హోంమంత్రి షా