Amit Shah: మళ్లీ ఆసుపత్రిలో చేరిన హోంమంత్రి షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah )  మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. 

Last Updated : Sep 13, 2020, 08:22 AM IST
Amit Shah: మళ్లీ ఆసుపత్రిలో చేరిన హోంమంత్రి షా

Amit Shah admitted againAIIMS: న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah )  మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌ ( AIIMS ) లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శనివారం రాత్రి సుమారు 11గంటల తర్వాత ఏయిమ్స్‌లో చేరారు. ఇటీవలనే కోలుకున్న అమిత్ షా మళ్లీ శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్యులు అమిషాకు చికిత్స అందిస్తున్నారు. Also read: NEET 2020 Exam: నేడే నీట్.. విద్యార్థులు ఇవి పాటించాలి

అయితే.. అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా సోకగా.. ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్‌గా రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నాలుగు రోజుల్లోనే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి.. చికిత్స తర్వాత 31న డిశ్చార్జ్ అయ్యారు. Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x