Vikas Dubey Mother: చిన్నోడా.. నువ్వు లొంగిపోరా: వికాస్ దుబే తల్లి
Vikas Dubey Encounter | మీ అన్న వికాస్ దుబేలా నువ్వు చనిపోకూడదు రా.. పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపో అని చిన్న కొడుకును తల్లి సరళా దేవి కోరుతోంది. నువ్వు వచ్చి లొంగిపో.. లేకపోతే పోలీసులు నిన్ను కూడా ఎన్‌కౌంటర్ చేస్తారంటూ సరళా దేవి ఆవేదన వ్యక్తం చేశారు
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తల్లి సరళా దేవిలో ఆందోళన మొదలైంది. సోదరుడు వికాస్ దుబే(Vikas Dubey Encounter)లా నువ్వు చనిపోకూడదు రా.. పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపో అని చిన్న కొడుకును ఆమె కోరుతోంది. ఏఎన్ఐ మీడియాలో సరళా దేవి మాట్లాడుతూ.. నువ్వు వచ్చి లొంగిపో.. లేకపోతే పోలీసులు నిన్ను కూడా ఎన్‌కౌంటర్ చేస్తారంటూ సరళా దేవి ((Vikas Dubey Mother Sarla Devi)ఆవేదన వ్యక్తం చేశారు. YouTube Star పెద్ద మనసు.. బాధితులకు భారీ సాయం
వికాస్ దుబే తమ్ముడు దీప్ ప్రకాష్ దుబే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ద్వారా తన చిన్న కొడుకు దీప్ ప్రకాష్ దుబేకు ఆమె ఓ విన్నపం చేశారు. ‘దీప్ ప్రకాష్ నువ్వు ఎక్కడున్నా వచ్చి పోలీసులకు లొంగిపో నాయనా. లేకపోతే పోలీసులు నీతో పాటు నీ కుటుంబాన్ని ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తారు. పోలీసులకు లొంగిపోతే వాళ్లే నిన్ను రక్షిస్తారు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు. నువ్వు దాక్కోవలసిన అవసరం ఏముంది. నీ అన్న వికాస్ దుబే కారణంగా నీకు ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం ఫోన్ ద్వారా నన్ను అయినా సంప్రదించమంటూ’ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తల్లి సరళా దేవి చిన్నకొడుకు దీప్ ప్రకాష్ దుబేను కోరారు. అతడిపై రూ.20వేల వరకు పోలీసు రివార్డు ఉంది. అతడు ఎక్కడున్నాడో సమాచారం అందిస్తే ఆ నగదు అందజేస్తారు. RGV ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది..
కాగా, జులై 3న కాన్పూర్ పోలీసులు వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు అతడి గ్రామానికి వెళ్లగా.. ముందుగానే విషయం తెలుసుకున్న నిందితులు ప్లాన్ ప్రకారం పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, దాడి చేయగా 8 మంది చనిపోయారు. అనంతరం వికాస్ దుబే గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. జులై 9న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వచ్చిన వికాస్ దుబేను పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 10న కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోతున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేపై పోలీసులు కాల్పులు జరపగా.. చనిపోవడం తెలిసిందే. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్