Mangaluru man Srinivas Gowda quits IT job to open a Donkey farm : ప్రస్తుతం యువతకు లక్షల్లో సాలరీ వచ్చే 'సాఫ్ట్‌వేర్ ఉద్యోగం' అంటే యమా క్రేజ్. సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించేందుకు లక్షల రూపాయలు దారపోసి.. కోచింగ్‌లు తీసుకుంటున్నారు. సీ, జావా, ఒరాకిల్, డీబీఎంఎస్ అంటూ రకరకాల కోర్సులు నేర్చుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం కంపెనీల ముందు క్యూ కడుతున్నారు. చిన్న కంకపెనీ అయినా ఫరవాలేదు.. ముందు జాబ్ కావాలనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందంటే చాలు.. యువత ఎగిరి గంతులేస్తుంది. అయితే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి లక్షల్లో సాలరీ వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి.. గాడిదలు పెంచుకుంటున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల శ్రీనివాస గౌడ బీఏ గ్రాడ్యుయేష్‌ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేష్‌ అనంతరం సాఫ్ట్‌వేర్‌ జాబ్ చేయాలని బెంగళూరుకు వెళ్ళాడు. మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గ కోర్సులు నేర్చుకుని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. మంచి జీతం, హై ఫై లైఫ్..  శ్రీనివాస గౌడ జీవితం ఇలా సాగిపోతుంది. అయితే ఒకరి కింద పని చేయడంలో ఉండే అసంతృప్తి అతడికి ఉంది. దాంతో చాలా రోజులు ఆలోచించిన ఆయన తన మనసుకు నచ్చిన పని చేయాలని డిసైడ్‌ అయ్యాడు. 


శ్రీనివాస గౌడ సొంతంగా ఏదైనా చేయాలని అనుకుంటున్న సమయంలో 2020లో కరోనా కారణంగా బెంగళూరు వీడి.. దక్షిణ కన్నడ జిల్లాలోని సొంతూరైన ఐరాకు వెళ్ళిపోయాడు. వెంటనే జాబ్‌కు రిజైన్‌ చేశాడు. ముందుగా ఇంటి దగ్గరున్న రెండున్నర ఎకరాల స్థలంలో మేకలు పెంచి.. ఆపై కడక్‌ నాథ్‌ కోళ్లు, కుందేళ్ల పెంపకం ప్రారంభించాడు. దాంతో శ్రీనివాస్‌ను అంతా వింతగా చూశారు. అవేమీ పట్టించుకోని శ్రీనివాస్ ముందుకు వెళ్ళాడు. రెండేళ్లు గడిచిన తర్వాత మార్కెట్‌ ఎలా ఉంది, బయటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసింది. 


గాడిదల ఫామ్‌ ఏర్పాటు చేయాలని శ్రీనివాస గౌడ నిర్ణయించుకున్నాడు. మేలు రకం గాడిదల కోసం అన్వేషణ ప్రారంభించి.. తాజాగా 20 గాడిదలతో వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించాడు. గాడిద పాలు మార్కెటింగ్‌ చేయడం కోసం బెంగళూరుతో పాటు కర్నాటకలో ఉన్న ఇతర నగరాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అది సక్సెస్ అయింది. గాడిదలు, ఫామ్‌ కోసం 42 లక్షల ఖర్చు కాగా.. ఇప్పటికే 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయట. గాడిదల పాల కోసం జనాలు ఎగబడుతున్నారట. 



తాజాగా ఓ మీడియాతో శ్రీనివాస గౌడ మాట్లాడుతూ... 'గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల్లో ఉబ్బసం వ్యాధికి ఔషధంగా గాడిద పాలు పోస్తారు. ప్రస్తుతం గాడిద పాలు దొరకం లేదనే విషయం గమనించాను. అందుకే గాడిదలో ఫామ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. అందరూ నన్నో పిచ్చోడిలా చూశారు. కానీ ఫామ్‌ ఏర్పాటు చేసిన ఆరు నెలలకే నాకు రూ. 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఇవి సప్లై చేయడమే కష్టంగా ఉంది. 30 మిల్లీలీటర్ల ప్యాకెట్​ ధర రూ.150గా విక్రయిస్తున్నాం. ప్రజలందరికీ పాలు అందించడమే లక్ష్యం' అని చెప్పారు. 


Also Read: సూపర్ సెంచరీ బాదిన మంత్రి.. మైదానంలోనే లవ్ లెటర్ చూపిస్తూ..!


Also Read: Flipkart Offers: ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్స్.. రూ.65 వేలు విలువ చేసే ఐఫోన్ అతి చౌక ధరకే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook