Manoj Tiwary Love Letter: సూపర్ సెంచరీ బాదిన మంత్రి.. మైదానంలోనే లవ్ లెటర్ చూపిస్తూ..!

Bengal Sports minister Manoj Tiwary Love Letter goes viral. 29వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ సాధించిన తర్వాత 36 ఏళ్ల బెంగాల్‌ మంత్రి మనోజ్ తివారీ విన్నూతంగా సంబరాలు చేసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 02:06 PM IST
  • 211 బంతుల్లో 102 పరుగులు
  • సూపర్ సెంచరీ బాదిన మంత్రి
  • మైదానంలోనే లవ్ లెటర్ చూపిస్తూ..
Manoj Tiwary Love Letter: సూపర్ సెంచరీ బాదిన మంత్రి.. మైదానంలోనే లవ్ లెటర్ చూపిస్తూ..!

Manoj Tiwary Love Letter goes viral after hits Century in Ranji Trophy: బెంగాల్ క్రీడల మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022లో అదరగొడుతున్నారు. ఆలూర్లోని కేఎస్‌సీఏ క్రికెట్ మైదానంలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో బెంగాల్‌ తరఫున ఆడుతున్న తివారీ.. శతకం బాదారు. 211 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి 29వ ఫస్ట్‌క్లాస్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. తివారీ, షాబాజ్ అహ్మద్ చెలరేగడంతో బెంగాల్‌ 89.2 ఓవర్లలో 273 పరుగులు చేసింది. 

29వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ సాధించిన తర్వాత 36 ఏళ్ల మంత్రి మనోజ్ తివారీ విన్నూతంగా సంబరాలు చేసుకున్నారు. జేబులోంచి లవ్ లెటర్ తీసి కెమెరాలకు చూపించారు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుస్మితా' అని లేఖలో రాసి ఉంది. లెటర్ రూపంలో తన కుటుంబం, తనకు సహకరించిన తన భార్య సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు. మనోజ్ తివారీ లవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. 

జార్ఖండ్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మనోజ్ తివారి (185 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) సూపర్ సెంచరీతో రాణించి బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన తివారీ.. రెండో ఇన్నింగ్స్‌లో 136 రన్స్ బాదారు. బెంగాల్‌ క్రీడల మంత్రి అయిన తర్వాత సాధించిన తొలి సెంచరీ ఇది. అయితే ఈ మ్యాచ్‌ డ్రా అయినప్పటికీ.. బెంగాల్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న బెంగాల్ మంత్రి.. మళ్లీ ఐపీఎల్‌లో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు.

గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన మనోజ్‌ తివారీ.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తృణమూల్‌ ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా వ్యవహరిస్తున్న తివారీ.. బెంగాల్‌ రంజీ జట్టు తరఫున దేశవాళీ కెరీర్‌ కొనసాగిస్తున్నారు. దేశవాళీ మ్యాచ్‌లతో పాటు భారత తరఫున తివారీ ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా ఆటగాడిగా 12 వన్డేలు, 3 టీ20లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకు 125 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 163 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 14000కు పైగా పరుగులు సాధించారు. 

Also Read: High Cholesterol: జీడి పప్పు తినడం వల్ల నిజంగానే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..!

Also Read: Srilankan Airlines: గగనతలంలో పైలట్ల అప్రమత్తత.. తప్పిన పెనుప్రమాదం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News