Lakhimpur Kheri violence: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttar Pradesh) లఖింపూర్ ఖేర్ (Lakhimpur Kheri) వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకారుల పైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతో పాటు, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంచిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఉన్న దాని ప్రకారం చూస్తే, 25 సెకన్ల పాటు ఉన్న వీడియోలో మొదట ఓ ఎస్‌యూవీ (SUV) వాహనం రైతులపై నుండి వెళ్లగా, వాహనం నడిపిన డ్రైవర్ ఎవరో స్పష్టంగా కనపడటం లేదు. 


Aslo Read: MAA Elections 2021: వేడెక్కిన 'మా' ఎలక్షన్స్...మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు




ఆదివారం ఆందోళనలో పాల్గొన్న రైతులకు తెలియకుండానే వారి వెనుక నుండి వచ్చి వాహనం గుద్దినట్టు తెలుస్తుంది. వాహనం డీ కొట్టిన తరువాత రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనై, వాహనంలో ఉన్న వారిపై దాడికి దిగారు. అక్కడ ఉన్న వాహనం మరియు వీడియోలో ఉన్న వాహనం ఒకే విధంగా ఉన్నట్టు మనం వీడియోలో చూడవచ్చు. 


వీడియోలో ఆందోళన చేస్తున్న రైతుల వెనక నుండి వాహనం వచ్చి.. వారిని డీ కొట్టడం.. అది గమనించిన మిగతా వారు పరుగులు తీయటం... ఆ వాహనం వెనుకే మరో వాహనం హారన్ మోగిస్తూ.. రైతులపైకి దూసుకెళ్లటం మనం చూడవచ్చు. 




ఇలా వాహనం రైతుల పైకి ఎక్కించటం కారణంగా ఆగ్రహానికి లోనైన అక్కడి వారు వాహనంలో ఉన్న డ్రైవర్, ముగ్గురు బీజేపీ (BJP) కార్యకర్తలను లాగి కర్రలతో దాడి చేయగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు (Human Rights Commission) ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఫలితంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government)ఈ ఘటనలో చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.45 లక్షలు మరియు గాయపడిన వారికి  రూ.10 లక్షలు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. 


Also Read: Telangana Assembly Session 2021: దళితబంధు ఉపపోరు కోసం కాదు..దళితుల అభివృద్దికే : KCR


రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కారు, మరో వాహనం దూసుకెళ్లడం వల్ల నలుగురు రైతులు, ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు గాయపడ్డారు. రైతుల ఆగ్రహానికి రెండు కార్లు తగలబెట్టగా కారులోని నలుగురు మృతి  చెందారు. అంతేకాకుండా, ఈ వార్తను రిపోర్ట్ చేయటానికి వెళ్లిన జర్నలిస్థ్ గాయపడగా.. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh CM Yogi Adityanath) రిటైర్డ్ న్యాయమూర్తితో ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook