Sasikala: త్వరలోనే చిన్నమ్మ విడుదల.. రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు
తమిళనాడు (Tamil nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ (V. K. Sasikala) అవినీతి, అక్రమాస్తుల కేసులో 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కావడానికి మార్గం సుగమం అయింది.
VK Sasikala pays rs 10 crore fine చెన్నై: తమిళనాడు (Tamil nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ (V. K. Sasikala) అవినీతి, అక్రమాస్తుల కేసులో 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కావడానికి మార్గం సుగమం అయింది. బెంగళూరు సిటీ సివిల్ కోర్టుకు ఆమె చెల్లించాల్సిన రూ.10 కోట్ల పది లక్షల జరిమానాను చెల్లించారు. దీంతో ఆమె జనవరి 27కు ముందుగానే జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని చిన్నమ్మ న్యాయవాది ముత్తుకుమార్ తెలిపారు. Also read: Minister Mewalal Choudhary: చార్జ్ తీసుకున్న గంటన్నరకే మంత్రి రాజీనామా
కోర్టుకు చెక్ ద్వారా 10 కోట్ల 10 లక్షల జరిమానాను చెల్లించిన అనంతరం దానికి సంబంధించిన రశీదులను పరప్పన అగ్రహార చెరకు పంపినట్లు సమాచారం. అయితే చిన్నమ్మ విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని జనవరి కంటే ముందుగానే ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశముందని ముత్తుకుమార్ తెలిపారు. అయితే తమిళనాడు ఎన్నికలకు ముందు శశికళ విడుదలవుతున్నారన్న వార్తతో రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే శశికళ విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని, శశికళతోపాటు, ఆమె కుటుంబసభ్యులను పార్టీకి దూరంగా ఉంచుతామని ముఖ్యమంత్రి కే. పళనిస్వామి తెలిపారు. Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి, ఏం అభివృద్ధి..: సొంత పార్టీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి