పాట్నా: బీహార్‌లో కొత్తగా నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త కేబినెట్‌లో మూడు రోజుల క్రితమే విద్యా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవలాల్ చౌదరి గురువారం మధ్యాహ్నం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, మంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత కేవలం గంటన్నరకే ఆయన తన మనసు మార్చుకుని మంత్రి పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు మంత్రి పదవి ఇవ్వడం ఏంటంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడమే అందుకు కారణమైంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ పార్టీ బిహార్ ప్రభుత్వంపై ( Bihar govt ) తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచింది. దీంతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే మేవాలాల్ చౌదరి ( Minister Mewalal Choudhary ) మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.
Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి, ఏం అభివృద్ధి..: సొంత పార్టీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
మేవాలాల్ చౌదరిపై అధికార దుర్వినియోగం ఆరోపణలు..
మేవాలాల్ చౌదరిపై అవినీతి ఆరోపణల విషయానికొస్తే.. 2017లో భాగల్‌పూర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా ఉన్న మేవాలాల్ చౌదరి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ సైంటిస్ట్ నియామకాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల కింద క్రిమినల్ కేసు నమోదైంది. అప్పటి బిహార్ గవర్నర్ ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాల మేరకే ఈ కేసు నమోదైంది. అటువంటి మేవాలాల్‌కి కేబినెట్‌లో ఎలా చోటు కల్పిస్తారని నితీష్ కుమార్‌పై ( Nitish Kumar ) ఆర్జేడీ విమర్శలు తీవ్రతరం చేసింది.
Also read : GHMC elections: పవన్ కళ్యాణ్‌ను కలవటంలేదు: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి