Voter ID Card: ఓటరు గుర్తింపు కార్డు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెసులుబాటు కల్పించింది. మీకు ఓటరు ఐడీ కార్డు కావాలంటే ఇకపై అంతా మీ చేతిలోనే ఉంది. అదెలాగో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటరు గుర్తింపు కార్డు ( Voter id card ) కోసం ఇప్పటివరకూ కేవలం మీసేవ కేంద్రాల ద్వారానే పొందే అవకాశముండేది. దీనికోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లడం, అక్కడ గంటల తరబడి నిరీక్షణ ఇవన్నీ సమస్యలే. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) గొప్ప వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి తమ తమ ఓటరు గుర్తింపు కార్డుల్ని మొబైల్ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే  అవకాశముంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని..ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 


ఈ నెల 25వ తేదీన జాతీయ  ఓటర్ల దినోత్సవం  ( National Voters day ) సందర్బంగా ఈ ఎపిక్ ( E Epic ) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం తెలిపింది. ఇకపై మీ మొబైల్ ఫోన్‌లోనే కార్డు డౌన్‌లోడ్ చేసుకుని..ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. ఈ ఎపిక్ విధానంపై ఓటర్లలో అవగాహన పెంచాలని ఎన్నికల అధికారుల్ని ఆదేశించింది. కొత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25 నుంచి 31 వరకూ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా డౌన్‌లోడ్ అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1 ఓటర్లంతా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ( How to download voter id card from your mobile ). 


Also read: West Bengal: దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: మమతా బెనర్జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook