ఉత్తర ప్రదేశ్ లో నకిలీ వైద్యుల కలకలం రాష్ట్రంలో సంచలనంగా మారింది. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటిదే... దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో జరిగింది.  సోమవారం రాత్రి (మార్చి 19), రాష్ట్ర పోలీసులు ముజఫర్నగర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులను అరెస్టు చేశారు. వారి స్థానంలో నిపుణులను పంపి పరీక్ష రాసేందుకు రూ.లక్ష రూపాయలను చీటింగ్ మాఫియాకు ఇచ్చారని ఆరోపణలు రావాడంతో అరెస్టు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయని నివేదికలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్ తో సంబంధమున్న మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంతో ఉన్న ఆరుగురు అధికారులతో సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా సహకారంతో 2014 నుంచి 600 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 'ఈ ముఠా విద్యార్ధుల పరీక్ష కాపీలను నిపుణుల కాపీలతో తారుమారు చేసింది. ఇందుకోసం రూ .1లక్ష -1.5 లక్షలు తీసుకున్నారు. యునివర్సిటీ అన్సర్ షీట్ మూల్యాంకనం శాఖ సిబ్బంది సమక్షంలోనే ఇదంతా జరిగింది' అని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది. ఈ ముఠా ఎంబీబీఎస్ విద్యార్థులకు మాత్రమే పరిమితం కాలేదని.. ఇతర ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్ధుల నుండి కూడా 30,000-40,000 రూపాయలు వసూలు చేసిందని తెలిపింది.


కేసు బయటికి పోకక్కుండా స్పెషల్ టాస్క్ ఫోర్సు(ఎస్టీఎఫ్) ఈ కేసును టేకప్ చేస్తోంది. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల (2017) సమాధానాల బండిల్ లను ఎస్టీఎఫ్ సీల్ చేసింది. ఈ విషయంపై  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.


ఈ ముఠాతో సంబంధమున్న ఐదుగురు యూనివర్సిటీ ఉద్యోగులపై కూడా కేసు నమోదు చేశారు. వారిలో ఒకరు సిబ్బంది కాగా, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు. మరో ఇద్దరు సిబ్బంది కోసం గాలిస్తున్నారు.