ఆ ప్రాంతం సహజంగానే వరదలకు నిలయంగా ఉంటుంది. అటువంటిది అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) అకస్మాత్తుగా వరదనీటిలో జారి పడిపోయారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి (MLA Harish Dhami)ని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కాపాడారు. ఉత్తరాఖండ్‌, పిథోరగఢ్‌లోని ధర్చౌలా ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. Corona Vaccine: రెండు వారాల్లో రష్యా కరోనా వ్యాక్సిన్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరద ప్రాంతానికి పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఎమ్మెల్యే హరీష్ ధామి వెళ్లారు. ధర్చౌలా ప్రాంతంలో వరద నీటిని దాడుతుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జారిపడ్డారు. వరద నీటి ప్రవాహానికి కొట్టుకున్న ఎమ్మెల్యేను వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, అనుచరులు కాపాడారు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఏఎన్ఐ మీడియా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. Ayodhya Ram Temple: పూజారి సహా 15 మందికి కరోనా పాజిటివ్



 Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే..   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్