ముంబై: సాధారణంగా మనకు ఏదైనా కష్టం వస్తే మానసిక ఒత్తిడికి లోనవుతుంటాం. అదే ప్రాణాలమీదకి వస్తే ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే క్రూర మృగాల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇదే విషయం మరోసారి రుజువైంది. మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కాస్వాన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఇటీవల పులుల దాడులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో జనవరి 25న గ్రామసరిహద్దుల్లోకి చొరబడ్డ ఓ పులి కొందరు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆ ముగ్గురు వ్యక్తులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. చివరికి ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి చనిపోయినట్లు కింద పడిపోయి ఊపిరి ఆగినట్లు నటించాడు. వాసన చూసి, ఆ వ్యక్తిని గమనించిన పులి.. చనిపోయాడని భావించింది. గ్రామస్తులు పరుగున రావడాన్ని గమనించి అక్కడి నుంచి పారిపోయింది. పులి బారి నుంచి ఆ వ్యక్తి సమయస్ఫూర్తితో ఎలా బతికిపోయాడో మీరు కూడా ఈ ట్వీట్ వీడియోలో వీక్షించవచ్చు. తనకు ఓ సీనియర్ అధికారి వీడియో షేర్ చేశారని ప్రవీణ్ కాస్వాన్ ట్వీట్‌లో తెలిపారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..