'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి. ఒకదాని వెనుక ఒకటి ఇప్పటి వరకు నాలుగు లాక్ డౌన్‌లు విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైనందున ఫ్యాక్టరీలు, కంపెనీలు, వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు కేంద్ర కొన్ని మార్గదర్శకాలు, సడలింపులతో అనుమతి ఇచ్చింది. దీంతో కొద్ది రోజుల క్రితం నుంచే ఆంక్షల మధ్య వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు తెరుచుకుంటున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది.


ఐతే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూసివేసే ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక సర్కారు ముందడుగు వేయబోతోంది. లాక్ డౌన్ 4.0  చివరి తేదీ అయిన మే 31  తర్వాత ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ప్రకటించారు. దీంతో కర్ణాటకలో దాదాపు 2 నెలలకు పైగా మూసివేసి ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకోనున్నాయి. 


ఐతే ఆలయాల్లోకి కానీ, మసీదుల్లోకి కానీ, చర్చిల్లోకి కానీ.. భక్తులను పరిమిత సంఖ్యలో  అనుమతిస్తారు. అందరూ కచ్చితంగా  మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక  దూరం పాటించాల్సిందేనని  కర్ణాటక సర్కారు స్పష్టం చేసింది.  


ప్రస్తుతం కర్ణాటకలో 2 వేల 283 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 44 మంది చనిపోయారు.  పాజిటివ్ కేసులను కట్టిడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..