Prime Minister Narendra Modi says the government has repealed three farm laws. ​రైతుల ఆందోళనలతో మోదీ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.


ఇందుకు సంబంధించిన ప్రక్రియను.. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్​లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులు సహా వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు.


Also read: 'దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపే': సుప్రీంకోర్టు


మోదీ ఇంకా ఏం చెప్పారంటే..


'మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ఎక్కున ప్రధాన్యతనిచ్చింది. దేశంలో 80 శాతం మంది సన్నాకారు రైతులే ఉన్నారు. వారందిరికి వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి. అందుకే వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు చేశాం. నూతన సాగు చట్టాలు కూడా వారికి మేలు చేసేందుకే తెచ్చాం. కానీ అన్ని వర్గాల రైతులకు దీని గురించి సర్ది చెప్పలేకపోయాం. అందుకే వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం' అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మోదీ. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటు రైతులందరికీ తక్కువ ధరకే విత్తలాలు అందించేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.


Also read: ఫాస్ట్​లో 'చచ్చిన పాముపిల్ల'...56 మంది విద్యార్థులకు అస్వస్థత


Also read: వరి వార్: కేంద్రంపై కేసీఆర్‌ ప్రశ్నల వర్షం.. కుండబద్దలు కొట్టిన సర్కార్.. ఏమన్నారంటే..??


కొత్త చట్టాలు-ఆందోళనలు..


2020లో మూడు నూతన సాగు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో అవి చట్టాలుగా మారాయి. అయితే ఈ కొత్త చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలను ఏర్పాటు చేసుకుని కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు. రైతు సంఘాల నాయకుడు రాకేశ్​ టికాయిత్ ఈ ఆందోలనల్లో ముందున్నారు.


కొత్త చట్టాలకు సంబంధించి రైతుల ఆందోళనలు పలు మార్లు వివాదాస్పపదమయ్యాయి కూడా. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లింది.


ఆందోళనలు చేస్తున్న రైతులను ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా.. సరిహద్దుల వెంబడి భారీకేండ్లను కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇటీవేలే వాటిని తొలగించింది. ఈ నేపథ్యంలో రైతులను చెదరగొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ అందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.


అయితే ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. రైతుల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని స్వయంగా ప్రకటించి ఆందోళన చేస్తున్న అన్నదాతలకు శుభవార్త చెప్పారు.


Also read: తమిళనాడును వీడని వరణుడు.. నేడు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన


Also read: గురుద్వారాలో శుక్రవారం ముస్లింల ప్రార్థనలు.. ముస్లిం సోదరులకు స్వాగతం పలికిన గురుద్వారా అసోసియేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook