మోదీ సర్కార్‌కి గుణపాఠం చెప్పాలి: బీజేపీ లక్ష్యంగా స్టాలిన్ తొలి ప్రసంగం
మోదీ సర్కార్‌కి గుణపాఠం చెప్పాలి: స్టాలిన్
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అస్తమయంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ పార్టీకి ఆయన వారసుడి హోదాలో ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి అధ్యక్షుడి హోదాలో చేసిన మొట్టమొదటి ప్రసంగంతోనే బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నిర్విర్యం చేసిన మోదీ సర్కార్ కి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని స్టాలిన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.