Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో అల్పపీడనంగా బలపడుతోంది. ఉపరితల ఆవర్తనానికి అల్పపీడనం తోడు అయ్యింది. ఉపరితల ఆవర్తనం..సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ప్రస్తుతం నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాగల రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపునకు వచ్చే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 5, 6 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముసురు పట్టుకుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు వెల్లడించాయి. క్రమ క్రమంగా ఉపరితల ఆవర్తనం ఉన్న చోటే అల్పపీడనం ఏర్పడుతోంది. గతకొంతకాలంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అల్పపీడనం తోడైంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.


రాగల మూడురోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ వానలు పడనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు తెలిపాయి. ఇప్పటికే కోస్తాంధ్రలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. తీరం వెంట పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుంది.


తీరంలో ఈదురుగాలులు వీస్తాయని..గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఇవి ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కర్నూలు, అనంతపురం, కడప ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు తేలికపాటి వర్షాలు ఉండనున్నాయి. 


Also read:Prabhas Surgery : మెట్లు కూడా దిగలేకపోతోన్న డార్లింగ్.. ఓం రౌత్, కృతి సనన్ సాయం


Also read:IND vs SA: టీమిండియాను వెంటాడుతున్న డెత్ ఓవర్ల ఫోబియా..అలా చేస్తామన్న రోహిత్ శర్మ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook