న్యూఢిల్లీ: ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో అలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయి. వీటి ప్రభావంతో కేరళ తీరంలో 100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆఫ్రికా గాలుల కారణంగా సముద్రంలో అలలు భారీగా విరుచుకుపడతాయని ప్రపంచ సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ పేర్కొంది. ఈ అలల ప్రభావం ఎక్కువగా భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలపై  ఉంటుందని ఇన్ కాయిస్ సంస్థ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని ఇన్ కాయిస్ హెచ్చరించింది. ఈ నెల 26వ తేదీ వరకూ ఈ అలలు ఎగిసిపడతాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అండమాన్‌ తీరం నుంచి భారత్‌ ప్రధాన భూభాగం వైపు అలలు వస్తున్నాయని, తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్‌ తీరాల్లో అలలు అలజడి సృష్టిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. పశ్చిమ తీరంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లోని అలలు అలజడి సృష్టిస్తాయని తెలిపింది.