Weather Report: మండే ఎండల్లో.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు!
Heat Wave May decrease Over Telangana. వాయువ్య, మధ్య భారతంలో సోమవారం నుంచి హీట్ వేవ్ (వడగాలులు) తగ్గుముఖం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.
Heat Wave May Abate Over AP and Telangana from Today: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. దాంతో గత కొన్ని రోజులుగా ఒక్కోచోట 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే ఉక్కకపోతను భరించలేకపోతున్నారు. ఈ సమయంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది.
వాయువ్య, మధ్య భారతంలో సోమవారం నుంచి హీట్ వేవ్ (వడగాలులు) తగ్గుముఖం పడుతుందని ఐఎండీ వెల్లడించింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఛండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. మంగళవారం (మే 3) తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు చోట్ల హీట్ వేవ్ తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు.
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి తన ప్రతాపం చూపించాడు. మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అప్పుడప్పుడు వరుణుడు కరుణిస్తున్నాడు. అకాల వర్షాల కారణంగా వాతావరణం చల్లబడడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. తాజాగా హీట్‌వేవ్ తగ్గుతుందని ఐఎండీ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది.
Also Read: Covid 19 Cases: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్‌లో కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే!
Also Read: Vishwak Sen Prank: నడిరోడ్డుపై విశ్వక్ సేన్ రచ్చ.. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook