Weather Updates: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Today Rain Updates: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? వర్షాలు కురవనున్నాయా..?
Today Rain Updates: తెలుగు రాష్ట్రాల్లో సరిగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతుండగా.. ఉత్తరాదిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరో 5 రోజుల పాటు మహారాష్ట్ర రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఉత్తరాఖండ్‌లో రేపు అనేక ప్రదేశాలలో చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జూలై 19న గుజరాత్‌పై భారీ నుంచి అతి భారీ పాతం ఉంటుందని అంచనా వేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కోస్తా కర్ణాటక ప్రాంతంలో జూలై 19 వరకు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జూలై 18, 19వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 18, 19 తేదీల్లో తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే 4 రోజుల్లో ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. అయితే పశ్చిమ రాజస్థాన్‌లో ఎటువంటి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏపీలో నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!
Also Read: Tomato Price Today: ఐదు టమటాలు ఎత్తుకెళ్లిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి