Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!

Jasprit Bumrah and Shreyas Iyer Ready To Return: జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఐర్లాండ్‌ సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా కప్ నాటికి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 16, 2023, 08:29 AM IST
Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!

Jasprit Bumrah and Shreyas Iyer Ready To Return: ప్రపంచ కప్ 2023 దగ్గర పడుతున్న వేళ`టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. గాయాలతో జట్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు తిరిగి జట్టులో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ ఆటగాళ్లిద్దరూ ముమ్మరంగా నెట్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు. బుమ్రా, అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌తో ఈ ఇద్దరు జట్టులో ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న విషయం తెలిసిందే. 

బుమ్రా చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో చివరి మ్యాచ్‌ ఆడాడు. అప్పటి నుంచి వెన్ను గాయంతో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మధ్యలో కోలుకుని జనవరిలో జరిగిన శ్రీలంక సిరీస్‌కు భారత వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నా.. మళ్లీ గాయం తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. మార్చిలో న్యూజిలాండ్‌లో వెన్ను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత ఏప్రిల్ నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. గత నెల నుంచి బౌలింగ్ ప్రారంభించిన బుమ్రా.. నెట్స్‌లో ఫుల్ ఎనర్జీతో బౌలింగ్ చేస్తున్నాడు. రోజుకు 8-10 ఓవర్లు విసరుతూ ప్రాక్టీస్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తుండడతో ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రాను తీసుకురావాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక శ్రేయాస్ అయ్యర్ చివరిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరపున ఆడాడు. ఆ మ్యాచ్‌‌లో వెన్ను నొప్పి కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆ తరువాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. శ్రేయాస్ ఏప్రిల్‌లో శస్త్రచికిత్స చేయించుకోగా.. నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న అయ్యర్.. నెట్స్‌తో ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.

మరో యంగ్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. నెట్స్‌లో క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటనకు పూర్తిగా ఫిట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆసియా కప్ 2023కు ప్రసిద్ధ్ జట్టులో స్థానం సంపాదించే ఛాన్స్ ఉంది. గతేడాది ఆగస్టు 20న జింబాబ్వేతో చివరి మ్యాచ్‌ ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్. గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వగా.. శస్త్ర చికిత్స అనంతరం ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టిపెట్టాడు.

Also Read: Kushi Update: విజయ్-సమంతల '‘ఖుషి'’ సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ కు రెడీ..!

Also Read: Amazing Dance With Fingers: చేతివేళ్లతోనే డాన్స్ ఇరగదీశాడు పో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News