West Bengal Lockdown: కరోనా, ఒమిక్రాన్​ భయాలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ్​ బెంగాల్​ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. లాక్​డౌన్​ను తలపించేలా ఆంక్షలు విధిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, యునివర్సిటీలు, స్పాలు, సెలూన్​లు, బ్యూటీ పార్లర్​లు, జూ పార్క్​లు, ఎంటర్​టైన్మెంట్ పార్క్​లు మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ్​ బెంగాలు ప్రధాన కార్యదర్శి హెచ్​కే ద్వివేది నూతన మార్గదర్శకాలు జారీ చేశారు.


రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ద్వివేది.


50 శాతం ఉద్యోగులకే అనుమతి..


దీనితో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యలయాలు 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పని చేయాలని ఆదేశించారు. అన్ని సమావేశాలు వర్చువల్​గా జరగాలని సూచించారు. ఇప్పటికే కోర్టుల్లో కూడా ప్రత్యక్ష పద్దతిలో విచారణలు నిలిపివేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటన చేశాయి. అత్యవసరమైతే తప్పా.. మిగతా అన్ని కేసులు వర్చువల్​గానే విచారణ జరపనున్నట్లు వివరించాయి.


జనవరి 5 నుంచి విమానాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించనుంది బెంగాల్​ ప్రభుత్వం. వారానికి రెండు రోజులు మాత్రమే ఢిల్లీ, ముంబయిలకు విమానాల రాకపోకలు నిర్వహించేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలకు అనుమతి రద్దు చేసింది బెంగాల్ ప్రభుత్వం.


రవాణా సదుపాయాలపైనా ఆంక్షలు..


నగరాల్లో లోకల్ ట్రైన్లలో కూడా 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడిచేందుకు ప్రభుత్వం అనుమతిచింది. అది కూడా రాత్రి 7 గంటల వరకే నడవాలని ఆదేశించింది. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల టైమింగ్స్, సామర్థ్యాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు ప్రభుత్వం.


Also read: Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో కొత్త లక్షణాలు.. కళ్లు ఎర్రగా మారడం, జుట్టు రాలడం!


Also read: Uttarakhand: పాఠశాలలో కరోనా కలకలం..85 మంది విద్యార్థులకు పాజిటివ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook