Mamata Banerjee: తప్పు జరిగితే దర్యాప్తు చేయాలి, కక్ష సాధింపు ఉండకూడదు
Mamata Banerjee: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కక్ష సాధింపులా ఉండకూడదని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mamata Banerjee: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్టుపై దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ తప్ప మరెవరూ ఇప్పటి వరకూ స్పందించలేదు. మమతా బెనర్జీ మాత్రం ఆరెస్ట్ చేసిన తీరును తప్పుబట్టారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొన్న ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు 10 గంటల విచారణ అనంతరం నిన్న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పించగా, సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. దాదాపు 8 గంటల సుదీర్ఘ వాదనల తరువాత నాలుగ్గంటల సేపు తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి..సాయంత్రం 7 గంటలకు తీర్పు వెల్లడించారు. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించడంతో..నిన్న అర్ధరాత్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. మరోవైపు చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై దేశవ్యాప్తంగా పెద్దగా స్పందన వ్యక్తం కాలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరిగ్గా లేదని చెప్పారు. ఆయన అరెస్ట్ కక్ష సాధింపులా కన్పిస్తోందన్నారు. తప్పు జరిగితే మాట్లాడి, విచారణ జరిపించాలని ప్రతీకారంతో ఏం చేయకూడదని హితవు పలికారు.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీ, తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook