West Bengal: అక్బర్, సీతా.. సింహాలకు వివాదస్పదంగా పేర్లు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీహెచ్ పీ..
Siligiri Enclosure: గత కొన్ని సంవత్సరాలుగా, మతాంతర ప్రేమ వ్యవహారాలు, వివాహాల కేసులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హిందు అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పెళ్లిళ్లు, వరుసగా చోటు చేసుకున్న లవ్ జీహదీల ఘటనలు తీవ్ర వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Akbar can not be with sita Lion names Dispute: సాధారణంగా ఈ మధ్య కాలంలో లవ్ జీహదీల ఘటనలు మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇతర మతాలకు చెందిన యువతులను మతమార్పిడులు చేయించి, ఆతర్వాత వారిపై అమానుషాలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకో చోటు చేసుకున్నాయి.
ఉండగా... వెస్ట్ బెంగాల్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మన దేశంలో పరమత సహనంతో ఉంటారు. ఒకరిమతం, మరోకరి ఆచారాలు గౌరవిస్తూ, సోదర భావంతో ఉంటారు. కానీ కొందరు మాత్రం కొన్నిచర్యల వల్ల పరస్పరం విద్వేషాలు తలెత్తేలా పనులు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి వెస్ట్ బెంగాలో జరిగింది.
Read More: Belly fat: బెల్లిఫ్యాట్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ టిప్స్ డైలీ పాటిస్తే వారంలో చెక్ పెట్టేయోచ్చు..
పశ్చిమబెంగాల్ లో అటవీ శాఖ అధికారులు చేసిన పనికి వీహెచ్ పీ సీరియస్ అయ్యింది. సిల్ గురిలోని సఫారీ పార్కులో ఓక మగ, ఆడ సింహలు ఉన్నాయి. దీనికి అధికారులు అక్బర్ , సీతా అని పేర్లుపెట్టారు. ఆ తర్వాత వాటిని ఓకే ఎన్ క్లోజర్ లలో ఉంచడం వివాదస్పదంగా మారింది. దీనిపై హిందు సంఘాలు మండిపడున్నాయి. తమ మనో భావాలను కావాలనే రెచ్చగొట్టే విధంగా చర్యలున్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వెస్ట్ బెంగాల్ ఫారెస్ట డిపార్ట్ మెంట్, బెంగాల్ సఫారీ పార్క్ డైరెక్టర్ లలో దీనిలో ప్రతివాదాలుగా చేర్చారు. ఈ మేరకు ఫిబ్రవరీ 16న జస్టిస్ సౌగత భట్టాచార్య కలకత్తా హైకోర్టు జల్ఫాయిగురి బెంచ్ ను ఆశ్రయించగా.. ఫిబ్రవరి 20 మంగళవారం విచారణ చేయనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఈ రెండుపేర్లు పెట్టడం, ఒకే ఎన్ క్లోజర్ లో పెట్టడంపై.. బజరంగ్ దళ్, శ్రీ రామ్ సేన మరియు విశ్వ హిందూ పరిషత్ (VHP) వంటి కొన్ని హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. మెజారిటీ కమ్యూనిటీ నుండి అమ్మాయిలను ఇస్లాం మతంలోకి మోసపూరితంగా మార్చడానికి మైనారిటీ కమ్యూనిటీ చేస్తున్న ప్రయత్నంగా పేర్కొంటూ ఈ రకమైన పొత్తులను వ్యతిరేకించాయి. ఇది పూర్తిగా హిందూ మతాన్ని అవమానించారని పేర్కొంటూ VHP దీన్ని తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో హట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook