August 15: కరోనా వారియర్లకు నివాళిగా..సారే జహాసే అచ్ఛా
సారే జహాసే అచ్ఛా..హిందూ సితా హమారా...మౌలానా అల్లామా ఇక్బాల్ రచించిన సుమధుర గీతం ముంబైలో ప్రవహిస్తోందిప్పుడు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరోనా వారియర్లకు నివాళి ఇచ్చే క్రమంలో భాగంగా గేట్ వే ఆఫ్ ఇండియా ముస్తాబవుతోంది.
సారే జహాసే అచ్ఛా..హిందూ సితా హమారా...మౌలానా అల్లామా ఇక్బాల్ రచించిన సుమధుర గీతం ముంబైలో ప్రవహిస్తోందిప్పుడు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం ( Independence day ) సందర్భంగా కరోనా వారియర్లకు నివాళి ఇచ్చే క్రమంలో భాగంగా గేట్ వే ఆఫ్ ఇండియా ముస్తాబవుతోంది.
పంద్రాగస్టు వేడుకలకు ( August 15 celebrations ) మరో వారం రోజులు మిగిలింది. కరోనా మహమ్మారి ( Corona pandemic ) నేపధ్యంలో సామాజికదూరం పాటిస్తూనే వేడుకలు చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. పంద్రాగస్టు అతిధులుగా కరోనా వారియర్ల ( Corona warriors ) ను పిలిచి గౌరవం అందించాలని ఇప్పటికే కేంద్రం పిలుపిచ్చింది. ప్రాణాలు కోల్పోయిన కరోనా వారియర్లకు నివాళి కూడా అర్పించనున్నారు. 73 వ స్వాతంత్ర్యదినోత్సవా ( 73rd Independence day ) న ముంబైలోని ( Mumbai ) గేట్ వే ఆఫ్ ఇండియా ఇందుకు ముస్తాబవుతోంది. పశ్చిమ నావికా దళం దీనికి సమాయత్తమవుతోంది. పశ్చిమ నావికా దళానికి ( Western naval command ) చెందిన నేవల్ సెంట్రల్ బ్యాండ్ కరోనా వారియర్లకు నివాళి అర్పిస్తూ...లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సారే జహాసే అచ్ఛా...హిందూ సితా హమారా అంటూ మౌనాలా అల్లామా ఇక్బాల్ రచించిన గీతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియా ( Gate way of india ) సాక్షిగా అత్యంత సుమధురంగా ఆలపిస్తూ...ఓలలాడిస్తూ సాగించిన లైవ్ పెర్ఫార్మెన్స్ కన్నులవిందుగా సాగింది.
Also read: Flight Crash: మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, ప్రమాదంపై ఏఏఐ ఏమంటోంది ?