ఒక వైపు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తూ.. ఒక రకంగా చెప్పాలంటే విజయం వైపు దూసుకుపోతున్న బీజేపీ..  అమ్రేలీ, నర్మద, పోరుబందర్‌, ఆనంద్‌, డాంగ్స్‌, తాపి జిల్లాల్లో పెద్దగా రాణించకపోవడం వెనుక కారణమేమై ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు. అలాగే  బనస్కంత, కచ్‌, బొతాద్‌, ద్వారకా, ఖేడా, మహిసాగర్‌, సబర్కంత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్, బీజేపీకి తగ్గ పోటీని ఇస్తూ.. అందరినీ ఆశ్చర్యపరచడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు మోదీ పాలనలో కంచుకోటలుగా పేరుగాంచిన పలు ప్రాంతాల్లో కూడా అధిక సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయడంతో కంగుతినడం బీజేపీ నాయకుల వంతైంది. ఒకవేళ బీజేపీ గెలిచినా.. అనుకున్న సంఖ్య కంటే ఎక్కువమంది ప్రజలు కాంగ్రెస్ వైపు ఎందుకు చూశారన్న విషయంలో కూడా బీజేపీ పార్టీ నేతలు తమను తాము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 




మోదీని 'ఏక్ థా టైగర్' అని సంబోధిస్తూ.. బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వేడుకలు చేసుకుంటున్న అభిమానులు




బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ




మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ.. మిఠాయిలు పంచుతున్న అభిమానులు