Masked Aadhaar Card Process: దేశంలోని ప్రతి పౌరుడికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఇదొక 12 అంకెల యూనిక్ కార్డు. ఇందులో వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ఇది చాలా కీలకమైన డాక్యుమెంట్. అదే సమయంలో దుర్వినియోగం అవుతున్నది కూడా అందుకే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డు దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకే యూఐడీఏఐ మాస్క్డ్ ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది. ఎవరైనా ఎక్కడైనా ఆధార్ కార్డు అడిగితే మీరు నిరభ్యంతరంగా ఈ మాస్క్డ్ ఆధార్ కార్డు సమర్పించవచ్చు. సాధారణ ఆధార్ కార్డులానే పనిచేస్తుంది. ఇందులో మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌లో చివరి 4 నెంబర్లు మాత్రమే పైకి కన్పిస్తాయి. మిగిలినవి XXXX మార్క్ చేసుంటాయి. దీనివల్ల ఎక్కడైనా ఎప్పుడైనా మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డు దుర్వినియోగం చేసేందుకు వీలుండదు. ఎందుకంటే ఆధార్ నెంబర్ డిస్‌ప్లే ఉండదు. మరి ఈ మాస్క్డ్ ఆధార్ కార్డు ఎలా పొందవచ్చు, ఏమైనా రుసుము చెల్లించాలా వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 


మాస్క్డ్ ఆధార్ కార్డు అనేది పూర్తిగా ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. సులభంగా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో క్షణాల్లో మాస్క్డ్ ఆధార్ కార్డు పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా ముందుగా https://uidai.gov.in/en/my-aadhaar/get-aadhaar.html పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్‌పై కన్పించే Download Aadhaar ఆప్షన్ క్లిక్ చేయాలి. 


ఇప్పుడక్కడ మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరిస్తూనే అక్కడ కన్పించే మాస్క్డ్ ఆధార్ కావాలా అనేది ఎంచుకోవాలి. అంతే క్షణాల్లో సెకన్ల వ్యవధిలో మీక్కావల్సిన మాస్క్డ్ ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇది పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. మీ మొత్తం పేరులో మొదటి నాలుగు కేపిటల్ అక్షరాలకు మీ పుట్టిన సంవత్సరం జోడిస్తే అదే పాస్‌వర్డ్ అవుతుంది. 


అంతే ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును ఎక్కడైనా ఎప్పుడైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దుర్వినియోగమయ్యే అవకాశం ఉండదు. 


Also read: Aadhaar Card Updates: ఆధార్ కార్డులో ఫోటో, అడ్రస్ సులభంగా మార్చుకునే పద్ధతి ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.