Amrit Bharat Express facilities: డిసెంబరు 30న  అయోధ్య వేదికగా రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  ప్రధాని ప్రారంభించిన రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో మొదటిది ఢిల్లీ - బీహార్‌లోని దర్బంగా మధ్య, రెండోది మాల్దా (పశ్చిమ బెంగాల్‌)-బెంగళూరు మధ్య నడుస్తాయి. ఇందులో రెండో రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ ఏపీలో 14 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ ట్రైన్ కు మెుత్తం 32 స్టాపులు ఉంటే.. అందులో 14 ఏపీలోనే ఉండటం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు
==> ఇది నాన్‌ ఏసీ రైలు. ఈ రైలు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
==>  పుష్- పుల్ అనే రెండు ఇంజిన్లు ఉండటం ఈ రైలు ప్రత్యేకత. 
==> ముందు వెనుక ఇంజిన్లు ఉండటం వల్ల ఇది తక్కువ సమయంలోనే వేగాన్ని అందుకుంటుంది. దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 
==> అంతేకాకుండా వంపు మార్గాలు, వంతెనలపై ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం కుదుపులు లేకుండా సాఫీగా సాగుతుంది.
==> ఈ రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కోచ్‌లు కాగా, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డ్ కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. 
==> ఇందులో కొన్ని సీట్లును మహిళలకు, దివ్యాంగులకు కేటాయించారు. 
==> ఈ రైలు ముందు భాగం ఏరోడైనమిక్‌ డిజైన్ లో రూపొందించారు. 
==> అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నారింజ మరియు బూడిద రంగులో ఉంటుంది.
==> ట్రైన్ లోపల ఆకర్షించే సీట్లు, CCTV, మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు, పబ్లిక్ ఇన్పర్మేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. 
==> దీనిని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో తయారు చేశారు. ఇది రెండు WAP-5 లోకోమోటివ్‌లను కలిగి ఉంటుంది. 


Also Read: IRCTC Refund Rules: ఛార్ట్ ప్రిపేరయ్యాక టికెట్ క్యాన్సిల్‌పై ఫుల్ రిఫండ్ ఎలా వస్తుందో తెలుసా


Also Read: Ayodhya Railway Station: కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ ప్రారంభం.. అయోధ్య నగరికి కొత్త సొగసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter