కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్లలో కొత్త ఫీచర్స్ కోసం వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లు తమ వినియోగదారులకు కొత్త ఫీచర్స్ అందించడానికి వీలైనంతగా కృషి చేస్తాయి. కానీ ఈసారి కొత్త ఏడాది సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అవును..  ఈసారి కొత్త ఏడాది నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పూర్తిగా పని చేయకుండా పోతుంది. మీరు విన్నది నిజమే. కానీ  దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్ పని చేయని ఫోన్లు 
* విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు
* 2.3.7 వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు 
* iOS 8 కంటే తక్కువ ఉన్న యాపిల్ ఫోన్లు 


వాట్సాప్ పని చేసే స్మార్ట్ ఫోన్లు 
* ఆండ్రాయిడ్ OS 4.0.3 కంటే  కొత్త వెర్షన్ ఫోన్లు 
* iOS 9 కంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఐ ఫోన్లు 
* జియో ఫోన్, జియో ఫోన్-2 


[[{"fid":"180807","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అందుబాటులోకి కొత్త ఫీచర్


వాట్సాప్‌ను సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్ చాలా కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే కొత్త ఏడాదిలో ఫిబ్రవరి 1 నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్.. FAQ section ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కారణంగా వాట్సాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేశారు. ఇది పాత  స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. కాబట్టి ఆయా ఫోన్లలో వాట్సాప్‌ను వినియోగదారులు ఉపయోగించలేరు.  
కొత్త అకౌంట్లకూ చెక్ 
పాత వెర్షన్లు ఉన్న ఆండ్రాయిడ్, iOS ఉన్న ఫోన్లలో వాట్సాప్ అందుబాటులో ఉండదని తెలిపిన ఫేస్ బుక్ కంపెనీ .. మరిన్ని విషయాలూ వెల్లడించింది. వాట్సాప్ పని చేయని ఫోన్లలో కొత్త అకౌంట్లు కూడా సృష్టించేందుకు వీలులేదని ప్రకటించింది. అంతే కాదు వాట్సాప్ ను అప్ డేట్ చేయడం కూడా కుదరదని స్పష్టం చేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..