పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019 కు వ్యతిరేకంగా ఆందోళన కారణంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఎక్కడ చూసినా హింస చెలరేగుతోంది.  దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. నిరసనకారుల ఆందోళన కారణంగా పలువురు మృతి చెందారు. ఐతే ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు..? ఎవరి ప్రోత్బలంతో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PFIపై అనుమానం


దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనల కుట్ర వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా..PFI ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటెలీజెన్స్ వర్గాలు PFI పై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి.  PFI ఎనిమిది రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు, హింస చెలరేగడంలో PFI పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. 


ఎనిమిది రాష్ట్రాల్లో వ్యూహరచన 
PFI ముఖ్యంగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, కేరళ, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చురుగ్గా పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో PFI సమావేశాలు నిర్వహించినట్లుగా మల్టీ ఏజెన్సీ సెంటర్..MAC తెలిపింది. అంతే కాదు దేశవ్యాప్తంగా CAA, NRCకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో PFI కి సంబంధించిన వ్యక్తులు చొరబడినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది.


[[{"fid":"180704","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


CAA, NRCకి వ్యతిరేకంగా కరపత్రాలు
 అసోం, పశ్చిమ బెంగాల్ లో PFI చాలా యాక్టివ్ గా పని చేస్తోంది. CAA చట్టం రాక ముందు నుంచే సామాన్య ప్రజలకు.. బిల్లుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచి పెట్టింది.  ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో విపరీతంగా ఆందోళనలు చెలరేగాయి.