Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అంచనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో భయాందోళనలు రేగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే.
Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అంచనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో భయాందోళనలు రేగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందంటే.
దేశంలో బెంగళూరు నుంచి ప్రారంభమైన ఒమిక్రాన్ వేరియంట్ అప్పుడు 5-6 రాష్ట్రాలకు విస్తరించింది. 2 కేసుల నుంచి 36 కేసులకు చేరింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో అన్నిదేశాలు అప్రమత్తమవుతున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే దక్షిణాఫ్రికా వంటి దేశాల్నించి అంతర్జాతీయ విమానా రాకపోకలపై నిషేధం విధించగా..మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. ప్రపంచంలో ఇప్పటికే 59 దేశాల్లో ఒమిక్రాన్ జాడలున్నాయి.
ఇక ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్‌కు(Corona Third Wave) ఇది నాంది పలుకుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమంది వైద్య నిపుణులు సైతం ఇదే విషయాన్ని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఇండియాలో థర్డ్‌వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ఇంకా అంతా కాలేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అనేక పరివర్తనాలు వెలుగుచూసిన నేపధ్యంలో కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చనే సూచనలున్నాయని డాక్టర్ పూనమ్ ఖేత్రావాల్ చెప్పారు. అయితే ఇది ఏ స్థాయిలో ఉంటుందనేది అప్పుడే చెప్పలేమన్నారు. ఇంకా ఇన్ఫెక్షన్ తీవ్రతపై స్పష్టత రావాలన్నారు. దక్షిణాఫ్రికా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌తో రీ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా నమోదవుతోందని చెప్పారు. డెల్టా వేరియంట్(Delta Variant) కంటే తక్కువస్థాయిలో లక్షణాలు కన్పిస్తున్నప్పటికీ..అప్పుడే అంచనా వేయడం కష్టమన్నారు. ఇండియాలో కరోనా థర్డ్‌వ్ రానుందా లేదా అనే అంశంపై అనిశ్చితి నెలకొన్నా...కొన్ని వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ (Omicron)కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోందన్నారు.
Also read: Sourav Ganguly: కోహ్లీ లేకుండానే టీమ్ ఇండియాకు టైటిల్, రోహిత్‌పై గంగూలీ ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook