దేశాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సీన్ ( corona vaccine ) కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్సాక్సీన్ అందుబాటులో వస్తే  తొలి వ్యాక్సీన్ ను కరోనాతో పోరాడుతున్న యోధులకు ( corona warriors ) ఇవ్వాలని ప్రదాని మోదీ ( PM Narendra Modi )  నిర్ణయించారు. పోస్ట్ వ్యాక్సీన్ ప్రణాళికపై మోదీ అద్యక్షత సమావేశం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సీన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని అందరికీ తెలుసు. అందుకే కోవిడ్19 వ్యాక్సీన్ కోసం ప్రపంచంలోని అగ్రదేశాలతో పాటు భారత్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ ( Bharat biotech ) కు తాజాగా  ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ ను ( covaxin ) మనుషులపై ప్రయోగించేందుకు అనుమతి లభించింది. మరోవైపు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford university )  ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సీన్ ను ఉత్పత్తి, మార్కెటింగ్ చేసే బాధ్యత మరో దేశీయ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ( serum institute of india )  దక్కింది. Also read: India's first vaccine భారత తొలి వ్యాక్సీన్ కు అనుమతి…


ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన తరువాత ప్రణాళిక ఎలా ఉండాలనేదానిపై ప్రదాని నరేంద్రమోదీ ( Narendra modi )  అధ్యక్షతన కీలకమైన సమావేశం జరిగింది. వైద్య సరఫరా వ్యవస్థల నిర్వహణ, వైరస్ ముప్పున్న జనాభాపై ప్రాధాన్యత, వివిధ ఏజెన్సీలు, ప్రైవేట్ రంగం, సివిల్ సొసైటీల మధ్య సమన్వయం వంటి అంశాల ఆధారంగా వ్యాక్సిిన్ పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మరీ ముఖ్యంగా కోవిడ్ 19 వైరస్ ( covid19 virus )  కట్టడి కోసం పోరాడుతున్నవారిలో ముందు వరుసలో ఉన్నవైద్యులకు తొలుతగా అంటే తొలి వ్యాక్సిన్ ను ఇవ్వాలని సమావేశంలో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. Also read: Maharashtra మహారాష్ట్రలో జూలై 31 వరకూ లాక్ డౌన్


రెండో ప్రాధాన్యతగా వైరస్ ముప్పున్న ప్రాంత ప్రజలకు అందించాలని సమావేశం సూచించింది. వ్యాక్సిన్ ను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చ సాగింది. వ్యాక్సిన తయారీ, ఉత్పత్తి ఇతర సామర్ధ్యాలపై రియల్ టైమ్ పర్యవేక్షణ ఉండాలని నిర్ణయించారు. Also read: Patanjali Coronavirus medicine: పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ?