Supreme Court Justice UU Lalith: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ప్రొసీడింగ్స్ వేళలపై సీనియర్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో ప్రొసీడింగ్స్‌ ప్రారంభమయ్యే సమయం గంటన్నర ముందుకు జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 'నా ఉద్దేశం ప్రకారం ఉదయం 9 గంటలకే ప్రొసీడింగ్స్ ప్రారంభించాలి. నేనెప్పుడూ చెబుతుంటాను.. మన పిల్లలు ఉదయం 9 గంటలకే స్కూల్స్‌కి వెళ్తున్నప్పుడు మనమెందుకు 9 గంటలకే ప్రొసీడింగ్స్‌ ప్రారంభించలేం..' అని అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా సుప్రీం కోర్టులో ప్రొసీడింగ్స్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. కానీ జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర, సుధాన్షు ధూలియాతో కూడిన సుప్రీం బెంచ్.. శుక్రవారం ఓ కేసు ప్రొసీడింగ్స్‌ను ఉదయం 9.30 గంటలకే ప్రారంభించింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం బెంచ్‌ను ప్రశంసించారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించేందుకు ఉదయం 9.30 గం. సమయం సరైనదని అభిప్రాయపడ్డారు.


జస్టిస్ యుయు లలిత్ మాట్లాడుతూ.. ప్రొసీడింగ్స్ త్వరగా మొదలైతే త్వరగా ముగించవచ్చునని అన్నారు. తద్వారా మరుసటిరోజు కేసులను స్టడీ చేయడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. ఉదయం 9గంటలకే ప్రొసీడింగ్స్ ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల కల్లా కేసుల విచారణ పూర్తి చేస్తే.. సాయంత్రం సమయాన్ని జడ్జిలు ఇతర కోర్టు పనులకు ఉపయోగించుకోవచ్చునని అన్నారు.


కాగా, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రస్తుతం జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. సీజేఐ ఎన్వీ రమణ తర్వాత రెండో సీనియర్ న్యాయమూర్తి ఆయనే. సీజేఐ రమణ ఆగస్టు 26న రిటైర్ కానుండగా.. తదుపరి సీజేఐగా లలిత్ బాధ్యతలు చేపడుతారు.


Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత తగ్గిందంటే...



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.