కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతా కోరలు చాచుతోంది. వయస్సుతో..ప్రాంతంతో సంబంధం లేకుండా అందర్నీ బాధిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న గణాంకాలు ఆందోళన కల్గిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకూ 38 లక్షల 58 వేలకు పైగా ప్రభావితమయ్యారు. ఇందులో  67 వేల మంది మృత్యువాకిట చేరారు. ఏకంగా 77 శాతం మంది చికిత్సతో కోలుకున్నారు. అటు మరణించినవారిలో కూడా 60 కంటే వయస్సు ఎక్కువగా ఉన్నవారే ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్నా గణాంకాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే మరణించేవారిలో ఎక్కువమంది 60 కంటే ఎక్కువ వయసున్నవారే అయినా కరోనా వైరస్ ప్రభావితమవుతున్నది మాత్రం ఎక్కువ గా 18-44 ఏళ్ల వయస్సున్నవారికే. ఇప్పటివరకూ దేశంలో నమోదైన మొత్తం 38 లక్షల కేసుల్లో 54 శాతం అంటే సగానికి పైగా ఈ వయస్సున్నవారే కావడం ఆశ్చర్యంగా ఉంది. 51 శాతం మరణాలు మాత్రం 60 కంటే ఎక్కువ వయస్సున్నవారిలోనే జరిగాయి. 45-60 ఏళ్ల వయస్సున్నవారిలో 36 శాతం, 26-44 మధ్య అయితే 11 శాతం మరణాలు నమోదయ్యాయి. 18-25 ఏళ్ల వయస్సు, 17 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు ఒక శాతం మాత్రమే చనిపోయారు. Also read: PM Modi: ప్రధాని మోదీ లక్ష్యంగా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్