నిషేదిత టిక్‌టాక్ యాప్‌ ( TikTok App ) ను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాల్ని సమర్పించామని టిక్‌టాక్ ఇండియా అధిపతి అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జాతీయ భద్రత, గోప్యత కారణాలతో గత నెలలో టిక్‌టాక్ యాప్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌ ( China Apps ) లను ఇండియా నిషేధించింది. నిషేధించేనాటికి భారత్ లో ఈ యాప్‌ను 2 వందల మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు గూగుల్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంతో తమ కస్టమర్ల కోసం టిక్‌టాక్ యాప్‌ను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ఇండియా అధిపతి నిఖిల్ గాంధీ ( TikTok India CEO Nikhil Gandhi ) స్పష్టం చేశారు.


ఇప్పటికే భారత్.. యాప్‌పై లేవనెత్తిన అన్ని అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినట్టు నిఖిల్ గాంధీ చెప్పారు. అదే విధంగా కేంద్రం వ్యక్తం చేస్తున్న అనుమానాల్ని నివృత్తి చేసేందుకు అధికార్లతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు గాంధీ తెలిపారు. డేటా గోప్యత, భద్రతతో సహా  అన్ని అంశాలు భారత చట్టాలకు లోబడి ఉన్నట్టు గాంధీ తెలిపారు. టిక్‌టాక్ వినియోగదారుల ( TikTok Customers ) సమాచారాన్ని ఏ దేశ ప్రభుత్వంతో కూడా పంచుకోలేదని..దేశ సమగ్రతను దెబ్బతీసే ఎటువంటి ఫీచర్‌ను యాప్‌లో వినియోగించలేదన్నారు. Also read: Rafale fighter jets: పాకిస్తాన్, చైనాలకు భారత్ వార్నింగ్