Rahul Gandhi: భారత రాజకీయాల్లో అత్యంత వయసు గల పెళ్లి కాని ప్రసాద్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాహుల్‌ గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడిగా కొనసాగుతున్న రాహుల్‌ యాభై యేళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎక్కడకు వెళ్లినా 'పెళ్లి ఎప్పుడు' అనే ప్రశ్న తప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే ప్రశ్న తలెత్తుండడంతో రాహుల్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడి పెళ్లిపై దేశమంతా ఎదురుచూస్తోంది. తాజాగా రాహుల్‌ తన పెళ్లిపై శుభవార్త చెప్పేశాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Elections High Tension: పోలింగ్‌ రోజు ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలతో చాలాచోట్ల ఉద్రిక్తత


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ సోమవారం పర్యటించారు. తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం ఇస్తూ జోష్‌ పెంచారు. ప్రసంగం ముగించుకుని వెళ్తున్న క్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఒక ప్రశ్న అడిగారు. 'పెళ్లెప్పుడు' అని ప్రశ్నించారు. సిగ్గుపడుతూ రాహుల్‌ 'ఇక నేను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు' అని చెబుతూ వెళ్లిపోయాడు. తన తమ్ముడి ప్రకటనపై ప్రియాంకా గాంధీ కూడా నవ్వుకుంది. కాగా ప్రస్తుతం రాహుల్‌ వయసు 53 ఏళ్లు.

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు


గతంలో తాను పెళ్లి చేసుకోనని రాహుల్‌ ప్రకటించాడు. 'ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా అంకితభావంలో ఉన్నా. ఈ క్రమంలో పెళ్లికి తావు లేదు' అని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ప్రకటనకు విరుద్ధంగా రాహుల్‌ పెళ్లి చేసుకుంటానని ప్రకటించడం గమనార్హం.


ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ రెండుచోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ తమ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నాడు. ఇప్పటికే వయనాడ్‌లో ఎన్నిక పూర్తవగా త్వరలోనే రాయ్‌బరేలీలో కూడా పోలింగ్‌ జరుగనుంది. తన తల్లి త్యాగం చేసిన సీటు నుంచి గెలవాలనే పట్టుదలతో రాహుల్‌ ఉన్నాడు. రెండు చోట్ల పోటీపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వయనాడ్‌లో ఓటమి ఖాయం కావడంతో రాయ్‌బరేలీని సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter