జీవితంలో సవాళ్లను స్వీకరించి...పోరాడి విజయం సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోలియం యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మోదీ మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గుజరాత్ ( Gujarat ) గాంధీనగర్లోని ( Gandhi nagar ) దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీ ( Deen dayal petroleum university ) 8వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముందుగా..మోనో క్రిష్టలైన్‌ సోలార్‌ ఫొటోవోల్టైక్‌ పానెల్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆన్‌ వాటర్‌ టెక్నాలజీలకు ప్రధాని మోదీ ( Prime minister narendra modi ) భూమి పూజ చేశారు. అనంతరం ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ - టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ , ‘ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌’ లను సైతం మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు.


జీవితంలో సవాళ్లను స్వీకరించి..పోరాడి ఓడించాలని పిలుపునిచ్చారు. సమస్యల్ని పరిష్కరించగలిగినప్పుడే విజయం సాధిస్తామన్నారు. 1922 - 47 కాలంలోని యువకులు దేశ స్వాతంత్రం కోసం అన్నింటినీ త్యజించారని మోదీ గుర్తు చేశారు. దేశం కోసం జీవించాలని..ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగమై.. బాధ్యతను అలవరుచుకోమని సూచించారు.


ప్రస్తుతం దేశంలో ఎనర్జీ విభాగం, ఉద్యోగాలు, ఉద్యోగ కల్పన వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. సహజ వాయువుల వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెండింతలు పెంచుతామన్నారు. Also read: Covid19 Virus: కరోనా వైరస్ సెకండ్ వేవ్..రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు