త్రిపుల్ తలాఖ్ పై మాట్లాడవద్దన్నా వినలేదు
భారత ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో త్రిపుల్ తలాఖ్ పై మాట్లాడారు. తాను ఆ సమయంలో ఎందుకు నోరువిప్పానో చెప్పారు.
భారత ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో త్రిపుల్ తలాఖ్ పై మాట్లాడారు. తాను ఆ సమయంలో ఎందుకు నోరువిప్పానో చెప్పారు. సుప్రీంకోర్టులో త్రిపుల్ తలాఖ్ పై విచారణ జరుగుతున్న సమయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు.
త్రిపుల్ తలాఖ్ పై విచారణ జరుగుతున్న సమయంలో అన్ని పత్రికలు యూపీలో ఎన్నికలు జరుగుతున్న కారణంగా మోదీ నోరు విప్పరని రాశారు. మీరు ఈ అంశంపై మాట్లాడితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యే అవకాశం ఉంది అని నాతో కొంతమంది అన్నారు. అయితే తాను మౌనంగా కూర్చోలేదని.. ఓటుబ్యాంకు రాజకీయాలు నేను చేయనని వారితో అన్నాను. త్రిపుల్ తలాఖ్ పై తాను మౌనం వహించలేదని.. నా వైఖరి ఏంటో అప్పుడే స్పష్టంగా చెప్పానని అన్నారు. త్రిపుల్ తలాఖ్ అంశం మహిళల హక్కులకు సంబంధించింది. ముందు మానవత్వం.. ఆతరువాతే ఎన్నికలు అని ఆయన గుజరాత్ బహిరంగ సభలో మాట్లాడారు.