Covid vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధానితో పాటు మంత్రులు సైతం వ్యాక్సిన్ తీసుకోనున్నారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid vaccination )దేశమంతా ప్రారంభమైంది. అయినా ప్రజల్లో పెద్దగా ఆసక్తి కన్పించడం లేదు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Prime minister Narendra modi ) వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం పోతుందని ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కీలకమైన వార్త వైరల్ అవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ దశ ( Covid vaccination second phase ) లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తీసుకోవచ్చనే వార్త వైరల్ అవడం ప్రారంభమైంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. 


ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం సందర్బంగా 50 ఏళ్లు పైడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. తొలిదశ ( First phase ) లో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న పోలీసులు, రక్షణ దళాలు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కోవ్యాగ్జిన్ తీసుకున్నవారిలో సైడ్‌ఎఫెక్ట్స్ రావడం, వ్యాక్సినేషన్‌కు స్పందన లేకపోవడంతో ప్రజల్లో వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాలున్నట్టు అర్ధమౌతోంది. ఈ నేపధ్యంలో ప్రజల్లో ఉన్న సందేహాల్ని నివృత్తకి చేయడానికి ముందుగా ప్రధాని సహా ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలుస్తోంది. 


Also read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook