'కరోనా వైరస్'.. భయంకరంగా కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటు భారత దేశంలోనూ కరోనా వైరస్ మహమ్మారి.. రోజు రోజుకు భయంకర రూపం దాలుస్తోంది. ప్రతి రోజూ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో భయాందోళన నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్.. రోజురోజుకు జనంపై పంజా విసురుతోంది. గత 24 గంటల్లో భారత దేశంలో కొత్తగా 1718 కొత్త కేసులు  నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 67 మంది కరోనా మహమ్మారికి  బలయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి 1074 మందిని బలి తీసుకుంది.


కరోనా వైరస్ దెబ్బకు మొత్తం దేశవ్యాప్తంగా 33050 మందికి  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో 23 వేల 651 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలోని పలు ఆస్పత్రులలో చికిత్స తీసుకుని 8 వేల  325 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారు. ఐతే కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయి.. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిన వారికి కూడా మరోసారి కరోనా మహమ్మారి తిరగబెడుతోంది. ఇది ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారుతోంది.