ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో తొలిసారిగా తన ఎన్నికల ప్రచారర్యాలీని ప్రారంభించారు. ఆయన బెంగళూరులో తన తొలి ప్రసంగం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో బీఫ్ సమస్యను లేవనెత్తుతూ, ఆదిత్యనాథ్.. సిద్దరామయ్యను విమర్శించారు. "రాష్ట్రంలో బీజేపీపార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గోవధ నిషేధంపై ఒక చట్టాన్ని రూపొందించాము. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, సిద్దరామయ్యకు హిందువు అని గుర్తొచ్చింది" అని చెప్పారు.


హిందువులపై కొనసాగుతున్న దాడులపై కూడా యోగి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20మంది హిందూ కార్యకర్తల హత్యలు జరిగాయి. ఈ ఘటనలతో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ లా అండ్  ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో? అంటూ ఎద్దేవా చేశారు. "త్రిపుల్ తలాక్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. ఈ ముఖ్యమైన మహిళా సాధికారిత బిల్లుపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టీకరించలేదు' అని ఆయన ఆరోపించారు. కులమతాల పేరుతో కాంగ్రెస్ విభజన రాజకీయాలు ఆడుతున్నట్లు ఆయన ఆరోపించారు.